Sri Tattvamu    Chapters   

శ్రీగాయత్రీపీఠమ్‌

మచిలీపత్తనం - కృష్ణామండలం

బ్రహ్మైవ సత్యమ్‌

జగద్గురు శ్రీమదాదిశంకర భగవత్సూజ్యపాద ప్రతిష్ఠాపితదక్షిణామ్నాయసంజ్ఞిక శ్రీ శృంగగిరిపీఠాధిష్ఠిత శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరభారతీ పూజ్యపాదైః తత్కరకమలసంజాత శ్రీ శ్రీ శ్రీ మదభినవ విద్యాతీర్థపూజ్యపాదైశ్చ సదయాభ్యనుజ్ఞాత శ్రీగాయత్రీపీఠాధిపత్య విరాజమానైః తైరేవ పూజ్యపాదైరనుగృహీత యోగపట్టైః పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతీస్వామిభిః

శ్రీ మఱ్ఱిపాటి వేంకటనరసింహారావు విషయే నారాయణస్మరణపూర్వక విరచితా7శిషః సముల్లసంతుతరామ్‌.

శ్రీమఱ్ఱిపాటి వేంకటనరసింహారావుగారు రచించిన 'శ్రీతత్త్వము' అను పుస్తకమును చూచినాము.

'తరతి శోక మాత్మవిద్‌' అను శ్రుతి ఆత్మజ్ఞానము వల్లనే మోక్షమని చాటుచున్నది. ప్రతివాడును 'నేను' 'నేను' అని తననుగురించి అనుచున్నను, ఆ 'నేను' యొక్క స్వరూపము తెలియుటలేదు. ఎవరి స్వరూపము వారికి తెలియక పోవుటకు కారణము అవిద్యయొక్క అవరణమే. అట్టి ఆవరణము పోయి ఆత్మసాక్షాత్కారమగుటకు శ్రీవిద్యోపాసనము ముఖ్యసాధనము. 'చరమే జన్మనియథా శ్రీవిద్యోపాసనకోభ##వేత్‌' అను శాస్త్రము చరమజన్మలోగాని శ్రీవిద్యోపాసన లభించదని చెప్పుచున్నది.

అట్టి శ్రీవిద్య బ్రహ్మవిద్యకంటె భిన్నము కాదని లలితా సహస్రనామములలో 'మిథ్యా జగదధిష్ఠానా' 'నిర్గుణా' 'నిరాకారా' 'నిష్కళా' మున్నగునామములు స్పష్టము చేయుచున్నవి. ప్రపంచములో 'చిత్‌' అనగా చైతన్యము లేక తెలివి అనునది ఒకటియు, 'శక్తి' అనునది ఒకటియు ఉండియున్నవని అందరకు విశదమే. ఆరెంటియొక్క సమ్మేళనమే చిచ్ఛక్తి. ఒకదానిని విడిచి రెండవది ఉండదు. 'చిత్‌' ప్రధానంగా ఉన్నపుడు బ్రహ్మవిద్య, శక్తి ప్రధానంగా ఉన్నపుడు శ్రీవిద్య అని అంటారు. కనుక బ్రహ్మవిద్యకును శ్రీవిద్యకును భేదము లేదు.

ఇట్టి విషయము శ్రియానంద తత్త్వములో స్పష్టము చేయబడినదనిన్ని, దానికి వివరణగా ఈ గ్రంథకర్త ఈ గ్రంథమును వ్రాసినాడనన్ని తెలియుచున్నది. ఆవిషయమును వివరింటకు గ్రంథకర్త మొదటిభాగములో బ్రహ్మవిద్యను గురించియు, తరువాత శ్రీవిద్యలో ప్రధానములగు బాలా, పంచదశీ,షోడశీ, గాయత్రీ మున్నగు మంత్రముల స్వరూపముల గురించియు విపులముగా సప్రమాణముగా విశదీకరించినారు. ఉపనిషత్తులు మున్నగు అనేక గ్రంథములలో నుంచియు, శ్రీ శ్రియానందనాథుల గ్రంథములలో నుంచియు ప్రమాణములు స్వీకరింపబడినవి.

ఈ గ్రంథకర్తయగు శ్రీ నరసింహారావుగారు శ్రీ విద్యోపాసకులు. వీరు జన్మాంతర సంస్కారముచే శ్రీదేవీ భక్తులగుయేగాక, దుర్లభములైన ముముక్షుత్వము, మహాపురుష సంశ్రయముకూడ వీరికి లభించినవి. అత్యంత శ్రద్ధాభక్తులతో వీరు గురు సేవచేసి చక్కని అభ్యాసము గావించినారు. దాని ఫలితముగ వీరికి ఒక దివ్యమైన స్వప్నము కలిగినది. ఆ స్వప్నములో ఆ మహాత్రిపురసుందరీదేవి దర్శనమిచ్చినది. ఆ దేవిని మనసార స్తుతించుకొన్నారు ఈ గ్రంథకర్త. ఆ స్వప్నమే ఈ గ్రంథరచనకు బీజము. అందుకనే ఆ మధుర స్వప్పవృత్తాంతముతోనే ఈ గ్రంథము ప్రారంభ##మైనది. ఆ మహాదేవిని 'అమ్మ' 'అమ్మ' 'అమ్మ' అను వీరి పిలుపులో వీరి హృదయము భక్తితో తొణికిసలాడుచున్నట్లు గోచరించును. ఇట్టి చక్కని గ్రంథమును రచించి, వీరు తమ జన్మను ధన్యమొనర్చుకున్నారు.

ఈ గ్రంథము ముముక్షువులకు చాల ఉపయోగకర మనుటకు సందియములేదు. ఈ గ్రంథకర్త ఆశించినట్లు ఈ గ్రంథపఠనముచే అజ్ఞానావరణముపోయి ఆత్మస్వరూపజ్ఞానము కలుగుగాక!

- అని మా నారాయణస్మరణపూర్వక ఆశీస్సులు.

శ్రీ శ్రీ శ్రీ

యాత్రాస్థానం - ఖమ్మంమెట్టు. (ఖమ్మం మెట్టుజిల్లా)

శోభకృత్‌ సం|| శ్రావణ కృష్ణపంచమి భృగువాసరం ది 9-8-1963.

-------

శ్రీనిర్వికల్పానందస్వామివారు

''వైదిక మతానుసారమగు శ్రీవిద్యాహృదయమును విశదీకరించు ఈ ఉద్గ్రంథము - సాధకహృదయ హృజ్జ్యోతి.''

శ్రీ రామకృష్ణ మఠము, ఇట్లు

రాజమండ్రి, 10-9-63. - స్వామీ నిర్వికల్పానంద.

Sri Tattvamu    Chapters